manisharma: నా దగ్గర నేర్చుకున్న వాళ్లు బయటికెళ్లి తిడుతుంటే బాధగానే ఉంటుంది: మణిశర్మ

  • నా గురువుల నుంచి ఎంతో నేర్చుకున్నాను 
  • నా నుంచి కొంతమంది నేర్చుకున్నారు 
  • నాలో అది ఒక మైనస్ అయ్యుంటుందేమో

మణిశర్మ ఎన్నో చిత్రాల విజయంలో తన సంగీతం కూడా ప్రధాన పాత్ర వహించేలా చేసి తన సత్తా చాటుకున్నారు. అలాంటి మణిశర్మ తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. " ఇళయరాజా .. రాజ్ -కోటి .. కీరవాణి దగ్గర నేను పనిచేశాను. వాళ్లందరి దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎప్పటికీ వాళ్లను నా గురువులుగానే భావిస్తుంటాను.

నా దగ్గర కూడా కొంతమంది పనిచేశారు .. వాళ్లు మాత్రం అంతా తామే చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. పైగా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్లినా వాళ్ల తిట్లే వినిపిస్తున్నాయి. నా దగ్గర పనిచేసినప్పుడు పర్ఫెక్షన్ కోసం తిట్టివుంటాను .. అలా అని చెప్పేసి అది కోపం కాదు. వ్యక్తిగతంగా నేను ఎవరినీ ఎప్పుడూ ఏమీ అనలేదు. నా దగ్గర నేర్చుకున్నవాళ్లు బయటికెళ్లి నన్నే తిడుతూ వుంటే బాధగానే ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఎక్కువ పర్ఫెక్షన్ కోరుకోవడం కూడా నా వైపు నుంచి ఒక మైనస్ కూడా అయ్యుంటుందేమో" అంటూ చెప్పుకొచ్చారు.     

More Telugu News