toy: 'బొమ్మ' తుపాకితో ఆడుకుంటూ చిన్నారి కాల్పులు... ఆస్పత్రి పాలైన తల్లి!
ఇంటి బయట గార్డెన్ లో నిజమైన తుపాకి కనిపించగా, దాన్ని బొమ్మ తుపాకి అనుకుంది ఓ మహిళ. దాన్ని ఇంటికి తీసుకొచ్చి తన కూతురుకి ఇచ్చింది. ఆడుకుంటూ ఆ చిన్నారి తుపాకిని కాల్చడంతో బుల్లెట్లు తుపాకి నుంచి తల్లివైపు దూసుకుపోయాయి. తీవ్ర గాయాల పాలైన ఆమెను పొరుగు వారు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో ఆరంబాగ్ లో ఈ ఘటన నిన్న జరిగింది. బుల్లెట్లతో లోడ్ చేసి ఉన్న నిజమైన తుపాకిని బొమ్మ అనుకున్న కకోలి జాన తన కూతురుకు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే, లోడ్ చేసి ఉన్న తుపాకి గార్డెన్ లో దొరకడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.