kcr: నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన కేసీఆర్!

  • రాష్ట్రాల అభివృద్ధి పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది
  • ఆర్థిక, రక్షణ, అంతర్జాతీయ అంశాలపై మరింత దృష్టిని సారించాలి
  • జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలి

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఇదే సమయంలో దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. కేసీఆర్ ప్రసంగంలోని ప్రధాన అంశాలు...

  • పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయితే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతోంది.
  • కీలక ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నాం.
  • వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తున్నాం. రూ. 1,050 కోట్ల వ్యయంతో గత మూడేళ్లలో 18.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 356 గోడౌన్లను నిర్మించాం.
  • అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇవ్వలేని పరిస్థితుల్లో... పన్ను రాయితీలనైనా కల్పించాలి.
  • రాష్ట్రాల అభివృద్ధి పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది.
  • వ్యవసాయానికి అనుంబంధ రంగాలైన పౌల్ట్రీ, మేకలు, గొర్రెలు, చేపల పెంపకం, డెయిరీ రంగాలపై దృష్టి సారించాలి. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును ఇవ్వాలి.
  • జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాలి.
  • వైద్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నగరీకరణ అంశాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛను ఇవ్వాలి.
  • విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ, అంతర్జాతీయ అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టిని సారించాలి.  

More Telugu News