మోదీతో విపక్ష ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కుమారస్వామి, చంద్రబాబు, పినరయి విజయన్... ఫొటోలు!

17-06-2018 Sun 12:09
  • వాడివేడిగా సాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం
  • సమావేశ మందిరంలో అరుదైన దృశ్యాలు
  • విపక్ష పార్టీల సీఎంలతో నవ్వుతూ మాట్లాడిన మోదీ

న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో కొన్ని అరుదైన దృశ్యాలు కనిపించాయి. బీజేపీయేతర ప్రభుత్వాలు నడుస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి కలసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలు నరేంద్ర మోదీకి అభివాదం చేశారు. వీరితో నరేంద్ర మోదీ సైతం నవ్వుతూ మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశ మందిరంలో కనిపించిన వీరి కలయిక దృశ్యాలను మీరూ చూడవచ్చు. కాగా, ప్రస్తుతం నీతి ఆయోగ్ సమావేశం వాడివేడిగా సాగుతోంది. బీజేపీ పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని, తదుపరి దశ అభివృద్ధిని గురించి ప్రస్తావిస్తుండగా, మిగతా రాష్ట్రాల సీఎంలు మాత్రం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. పెట్రోలు ధరల పెరుగుదల, జీఎస్టీ అమలు తరువాత ఏర్పడిన ఇబ్బందులు, నోట్ల రద్దు తరువాత నగదు కొరత, దళితులపై దాడులు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు.