kaala: భగవంతుడి దయ వల్ల 'కాలా' సక్సెస్!: రజనీకాంత్‌

  • 'కాలా'కు లభిస్తున్న ఆదరణ భగవంతుడి అనుగ్రహం వల్లే 
  • విదేశాల్లోనూ ఈ సినిమా బాగా ఆడుతోంది
  • కర్ణాటకలో ప్రభుత్వం సహకరించింది

మురికివాడల్లో నివసించే పేదల బతుకులు, వారి కష్టాలే నేపథ్యంగా వచ్చిన రజనీకాంత్‌ 'కాలా' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అమెరికా, మలేసియాల్లోనూ ఈ సినిమా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్‌ తన తదుపరి సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఆ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డార్జిలింగ్‌లో జరుగుతోంది.

ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ... 'కాలా'కు లభిస్తున్న ఆదరణ భగవంతుడి అనుగ్రహం వల్లే వచ్చిందని, దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాల్లోనూ ఈ సినిమా బాగా ఆడుతోందని అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం సహకరించడంతో అక్కడ కూడా 'కాలా' సినిమా బాగా ఆడుతోందని చెప్పారు.  

More Telugu News