music director anurag: మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ ఆత్మహత్యపై అతని స్నేహితుడి స్పందన!
- అనురాగ్ తో మూడేళ్ల నుంచి నాకు పరిచయం ఉంది
- గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించాడు
- ఆత్మహత్యకు ముందురోజు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు
ఆలస్యంగా వెలుగు చూసిన వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ వినిల్ (నాని) ఆత్మహత్య ఉదంతం కలకలం రేపుతోంది. వారం క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డ అనురాగ్ ఆత్మహత్యకేసు మిస్టరీగా మారింది. తన కొడుకు ఆత్మహత్యకు కారణం తెలియదని అతని తల్లి విజయ చెబుతుండటం గమనార్హం.
ఈ సందర్భంగా అనురాగ్ స్నేహితుడు శ్రీను మాట్లాడుతూ, అతనితో తనకు గత మూడేళ్లుగా పరిచయం ఉందని చెప్పాడు. తల్లిదండ్రులను బెదిరించడానికి గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పాడు. ఆత్మహత్యకు ముందురోజు తన స్నేహితుడితో కలిసి అనురాగ్ బయటకు వెళ్లాడని అన్నారు. కేరళ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ తో కలిసి అనురాగ్ పార్టీ చేసుకున్నాడని చెప్పాడు.
గత శనివారం రాత్రి పది గంటలకు తాగి ఇంటికి వచ్చాడని, ‘ఎందుకు తాగుతున్నావు?’ అని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో అనురాగ్ తన బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాస్ చెప్పాడు. కాగా, అనురాగ్ తాను ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గృహప్రవేశం అయిన నెలరోజులకే బెడ్ రూమ్ లో ఉరివేసుకున్న అనురాగ్, తనకు అవకాశాలు రాకపోవడంతో ఒత్తిడికి లోనవడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.