rakul preet singh: 'లక్స్' బ్రాండ్ అంబాసిడర్ గా రకుల్ ప్రీత్ సింగ్?

  • ఇటీవలే ప్రచార షూట్ లో పాల్గొన్న రకుల్
  • హిందీ చిత్ర సీమ వైపు వెళ్లడం వల్లే చాన్స్
  • ఈ సోప్ కు గతంలో కత్రినాకైఫ్, దీపికా పదుకొణె, అలియా భట్ ప్రచారం
ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ సోప్ 'లక్స్'కు బ్రాండ్ అంబాసిడర్ గా ఛాన్స్ పొందినట్టు సమాచారం. ఈ సోప్ కు గతంలో దిగ్గజ నటీమణులు కత్రినా కైఫ్, దీపికాపదుకొణె, అలియా భట్ వంటి వారు ప్రచారకర్తలుగా వ్యవహరించారు.

‘‘నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ దక్షిణాది నటి. కానీ, ఆమె ఇప్పుడు హిందీ సినిమాలు కూడా చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆమె గురించి తెలుసు. దీంతో ఆమె తమ బ్రాండ్ ప్రచారానికి సరిగ్గా సరిపోతుందని భావించారు. రకుల్ ఇటీవలే ముంబైలో జరిగిన ప్రచార వీడియో చిత్రీకరణలో పాల్గొంది’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రకుల్ ప్రస్తుతం ‘దే దే ప్యారే దే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్, టబు కూడా నటిస్తున్నారు.
rakul preet singh
brand ambassador
soap

More Telugu News