Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కృష్ణవంశీ సినిమాలో కాజల్!
  • షరతులు లేవంటున్న అనసూయ 
  • మహేశ్ హిందీ సినిమాపై భార్య వివరణ 
  • నిర్మాతకు సాయం చేసిన నారా రోహిత్!

*  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రూపొందించే చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్ర పోషించే అవకాశం వుంది. ఈ దర్శకుడు కొత్త వాళ్లతో ఓ లవ్ స్టోరీని చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం కాజల్ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం.
*  నచ్చితే కనుక ఎటువంటి పాత్రనైనా చేస్తానని, ఇందులో ఎటువంటి సంశయం లేదని నటి అనసూయ చెప్పింది. నచ్చితే కనుక మిడిల్ ఏజ్, ఓళ్డేజ్, యంగ్ ఏజ్ .. ఎలాంటి తరహా పాత్రనైనా చేస్తానని చెప్పింది.
*  మహేశ్ బాబు త్వరలో హిందీ చిత్రంలో నటించనున్నాడని, అందుకే ఇటీవల ముంబయ్ వెళ్లి వచ్చాడని వస్తున్న వార్తలను ఆయన భార్య నమ్రత కొట్టిపారేసింది. మహేశ్ ప్రస్తుతం ఏ హిందీ చిత్రంలోనూ నటించడం లేదని, తన తదుపరి చిత్రంలోని పాత్ర లుక్ కోసం స్టయిలిష్ తో చర్చించడానికి మాత్రమే ముంబయ్ వెళ్లాడని తెలిపింది.
*  యంగ్ హీరో నారా రోహిత్ ఆర్థిక ఇబ్బందుల్లో వున్న తన నిర్మాతకు సాయం చేశాడు. రోహిత్ హీరోగా కార్తికేయ ప్రసాద్ దర్శకత్వంలో 'పండగలా వచ్చాడు' అనే చిత్రం రూపొందుతోంది. అయితే, ఆర్థిక కారణాల వల్ల ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది. దీంతో నిర్మాతలను పిలిచి ఆర్థిక సాయం చేసి, చిత్రాన్ని పూర్తి చేయమని రోహిత్ చెప్పాడట.

More Telugu News