పూజ చేస్తూ శివలింగంపైనే కుప్పకూలి.. శివైక్యం చెందిన అర్చకుడు.. వీడియో చూడండి!

15-06-2018 Fri 15:27
  • భీమవరం సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో ఘటన
  • స్వామివారిపై పడి తుదిశ్వాస విడిచిన అర్చకుడు వెంకటరామారావు
  • 40 ఏళ్లుగా ఇదే ఆలయంలో సేవ చేస్తున్న అర్చకుడు

పూజ చేస్తూ, గుండెపోటుకు గురైన అర్చకుడు శివలింగంపైనే కుప్పకూలి, శివైక్యం చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడైన కందుకూరి వెంకటరామారావు స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆయకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన శివలింగంపైనే పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

 గుడిలో ఉన్న ఇతర అర్చకులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు. గర్భగుడిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన 11వ తేదీనే జరిగినా, ఆలస్యంగా వెలుగు చూసింది. రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించగా... శివలింగంపైనే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. గత 40 ఏళ్లుగా ఆయన ఈ ఆలయంలోనే స్వామివారికి సేవ చేస్తున్నారు.