monsoon: నిదానించిన రుతుపవనాలు... వచ్చే పది రోజులూ పొడి వాతావరణమే: అమెరికా వాతావరణ సంస్థ

  • రుతుపవనాల ఆరంభం బాగుంది
  • కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది
  • మరో పదిరోజులు పొడి వాతావరణమే
  • ఆ తర్వాత వర్షాలకు అవకాశం
దేశంలోకి నిర్ణీత వ్యవధి కంటే మూడు రోజుల ముందే అడుగు పెట్టిన నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం తగ్గింది. వాటి విస్తరణ నిదానంగా ఉందని అమెరికాకు చెందిన రేడియంట్ సొల్యూషన్స్ అనే వాతావరణ సంస్థ తెలియజేసింది. మే చివర్లో రుతుపవనాలు కేరళను తాకిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు ఇవి విస్తరించాయి.

‘‘భారత్ లో నైరుతి రుతుపవనాల ఆరంభం బాగుంది. కానీ, ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. రానున్న పది రోజులు పొడి వాతావరణమే ఉంటుంది’’ అని రేడియంట్ సొల్యూషన్స్ కు చెందిన సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త కైలే ట్యాప్లే తెలిపారు. వాయవ్య ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవాలు ఇంకా విస్తరించాల్సి ఉందన్నారు.

 ఈ నేపథ్యంలో రానున్న కొన్ని వారాలు పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేశారు. అయితే, పది రోజుల పొడి వాతావరణం తర్వాత తిరిగి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం మీద నాలుగు నెలల సీజన్ లో సాధారణం కంటే వర్షాలు కాస్త తక్కువే ఉండొచ్చన్నారు. కానీ, మనదేశ వాతావరణ శాఖ ఈ ఏడాది 97 శాతం వర్షాలు ఉంటాయని అంచనా వేసిన విషయం తెలిసిందే.
monsoon
rains
america

More Telugu News