Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో హారర్ చిత్రంలో త్రిష 
  • ఆ టైటిల్ బాలకృష్ణ కోసం కాదట! 
  • షూటింగ్ పూర్తి చేసిన 'గూఢచారి'
  • 'లవర్'కి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు  

*  ఇటు స్టార్ హీరోల సరసన నాయికగా నటిస్తూనే.. మరోపక్క కథానాయిక ప్రధాన చిత్రాలలో కూడా త్రిష నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. కేఎం సర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హారర్ కథాంశంతో సాగుతుందట.  
*  బాలకృష్ణ, వీవీ వినాయక్ కాంబినేషన్లో సి.కల్యాణ్ భారీ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి విదితమే. దీనికి 'ఏకే 47' అనే టైటిల్ని నిర్ణయించినట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఈ టైటిల్ బాలయ్య చిత్రం కోసం కాదని, తమ సంస్థ నిర్మించే మరో చిత్రం కోసం దీనిని రిజిస్టర్ చేశామని నిర్మాత కల్యాణ్ వివరణ ఇచ్చారు.
*  అడవి శేష్ హీరోగా నటిస్తున్న 'గూఢచారి' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగును మన దేశంతో పాటు బంగ్లాదేశ్, అమెరికాలలో కూడా నిర్వహించారు. శోభిత ధూళిపాళ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
*  రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'లవర్' చిత్రానికి మొత్తం ఐదుగురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. అంకిత్ తివారి, తనిష్క్ బాగ్చి, ఆర్కో, రిషి రిచ్, సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

More Telugu News