Gorantla Butchaiah Chowdary: కేసుల మాఫీకి 100 కోట్లు ఇచ్చిన జగన్.. నన్ను విమర్శిస్తాడా?: గోరంట్ల

  • గాలి జనార్దన్ రెడ్డి ద్వారా రాయబారం
  • తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పరిటాలను చంపించినోడు
  • హత్యా రాజకీయాలకు వారసుడు
  • జగన్‌పై గోరంట్ల ఫైర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి కేసుల మాఫీ కోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోందని టీడీపీ  సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసం గాలి జనార్దనరెడ్డి ద్వారా జగన్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చునే జగన్ తనను విమర్శించడం విడ్డూరమని అన్నారు.

హత్యా రాజకీయాలకు వారసుడైన జగన్.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పరిటాల రవిని హత్య చేయించారని, ఇందుకోసం అజీజ్ రెడ్డికి రూ.25 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. మైనింగ్ మాఫియా, ఓబుళాపురం గనుల గురించి ప్రశ్నిస్తున్నందుకే మొద్దు శీను, నారాయణ, పటోళ్ల గోవర్దన్‌రెడ్డితో కలిసి పరిటాలను హత్య చేయించారని అన్నారు. ఆ తర్వాత సాక్షులను కూడా చంపేశారన్నారు. జగన్ ఇప్పటికీ ఆ పరంపరను కొనసాగిస్తున్నారని గోరంట్ల అన్నారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP
Jagan

More Telugu News