Nara Lokesh: ఢిల్లీలో బీజేపీ ఏపీ నేతలతో వైసీపీ నేతలు కలవడంపై లోకేశ్ సెటైర్లు!
- ఢిల్లీలో పెద్దలను రహస్యంగా ఎందుకు కలిసుంటారు?
- ఆపరేషన్ గరుడానేమో
- లేకపోతే జగన్ కేసుల మాఫీ గురించి కావచ్చు
ఢిల్లీలో బీజేపీ ఏపీ నేతలతో వైసీపీ నేతలు సమావేశం కావడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ‘వైసీపీ, ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పెద్దలను ఈరోజు రహస్యంగా కలవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆపరేషన్ గరుడ, జగన్ కేసుల మాఫీ, తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకనా? లేకపోతే ఇవన్నీ అయి ఉండొచ్చా?' అంటూ చేసిన ట్వీట్ లో తనదైన శైలిలో ప్రశ్నించారు.
కాగా, ఢిల్లీలో బీజేపీ ఏపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఓ గదిలోకి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో పాటు ఆయన వెళ్లినట్లు మీడియా గుర్తించింది. వారంతా బీజేపీ అగ్రనేతలతోనూ సమావేశం జరిపినట్లు సమాచారం.