bmw: కొనుక్కున్న రోజే కాలిపోయిన బీఎండబ్ల్యూ కారు!

  • చైనాలో ఘటన
  • అగరబత్తుల కారణంగా చెలరేగిన మంటలు
  • వీడియో వైరల్‌

ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బీఎండబ్ల్యూ కారు అగరుబత్తుల కారణంగా కొన్న రోజే కాలి బూడిదైపోయిన ఘటన చైనాలోని యాంగ్జూ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సుమారు రూ.50 లక్షలు పెట్టి ఆ కారుని కొనుగోలు చేసిన వ్యక్తి దానిని పార్కింగ్‌ ప్రాంతంలో ఉంచాడు. అయితే, అక్కడ కొందరు పిల్లలు అగరుబత్తీలు వెలిగించినట్లు తెలుస్తోంది.

కొద్దిసేపటికే గాలికి అగరుబత్తిలోని నిప్పు రవ్వలు ఆ కారుకి అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. కారులోంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.                                                                        

More Telugu News