Govinda: 'డ్యాన్సింగ్ అంకుల్'తో కలసి స్టెప్పేసిన గోవిందా!

  • బంధువు వివాహంలో సంజీవ్ శ్రీవాత్సవ డ్యాన్స్
  • సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే సెలబ్రిటీ 
  • ఓ డ్యాన్స్ షోలో గోవిందాతో కలసి నృత్యం

సోషల్ మీడియా పుణ్యమాని గత నెలలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 'డ్యాన్సింగ్ అంకుల్' గుర్తున్నాడా? ఓ మ్యారేజ్ ఫంక్షన్ లో అచ్చు బాలీవుడ్ నటుడు గోవిందా మాదిరిగా ఆయన చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. దీంతో సంజీవ్ శ్రీవాత్సవ అనే ఈ అంకుల్ ఓ సెన్సేషన్ గా మారిపోయాడు. తాజాగా, 'డాన్స్ దివానే' సెట్స్ పై తన అభిమాన నటుడు గోవిందాను సంజీవ్ కలుసుకోగా, ఇద్దరూ కలసి వేదికపై స్టెప్పులేశారు. గోవిందాను అభిమానించే తనకు, ఆయనతో స్టేజ్ పంచుకునే అవకాశం లభిస్తుందని ఎన్నడూ భావించలేదని ఈ సందర్భంగా సంజీవ్ వ్యాఖ్యానించారు. తన భార్యతో కలసి ఈ షోకు గెస్టుగా సంజీవ్ వెళ్లగా, షో న్యాయనిర్ణేతలుగా ఉన్న మాధురీ దీక్షిత్, తుషార్ కాలియా, శశాంక్ ఖైతాన్ లు సైతం గోవిందా, సంజీవ్ డ్యాన్స్ చూసి ఆనందించారు.
(Pic Courtesy: Yogen Shah)

More Telugu News