stock markets: అమెరికా ఫెడ్ రేట్ల పెంపుతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్ 186 పాయింట్ల నష్టంతో...
  • నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో ట్రేడ్
  • ఫెడ్ రేట్ల పెంపు, చైనా పరిశ్రమల ఉత్పత్తి తక్కువగా ఉండడం ప్రభావం

ఈ ఏడాది రెండో సారి వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం నష్టాలతోనే సూచీలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో రెండు సార్లు పెంపు ఉంటుందని ఫెడ్ సంకేతం ఇవ్వడం ప్రధానంగా ప్రభావం చూపించింది.

దేశీయంగా కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందన్న ఆందోళనలు, ఆశించిన దాని కంటే చైనా పరిశ్రమల ఉత్పత్తి రేటు తక్కువగా నమోదవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం చూపించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్ ఉదయం 10.45 గంటల సమయానికి 186 పాయింట్లు కోల్పోయి 35,552 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 10,792 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ50 సూచీలో 40 స్టాక్ లు నష్టాల్లో ఉంటే, 9 మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క స్టాక్ ధరలో మార్పు లేదు. ఎస్ బీఐ 2 శాతం, టీసీఎస్ 1.5 శాతం చొప్పున నష్టంలో ట్రేడవుతుంటే, హెచ్ సీఎల్, సిప్లా, హిందాల్కో స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

More Telugu News