abbas naqvi: రాహుల్‌ గాంధీ ఇఫ్తార్‌ విందుపై అబ్బాస్‌ నఖ్వీ విమర్శలు

  • ఈరోజు సాయంత్రం రాహుల్‌ ఇఫ్తార్‌ విందు
  • రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న నఖ్వీ
  • మరోపక్క త్రిపుల్‌ తలాక్‌ బాధితులకు బీజేపీ విందు 

రంజాన్‌ సందర్భంగా ఈరోజు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో ఇఫ్తార్‌ విందు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ విందుకి మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలతో పాటు పలు పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీని విమర్శించారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ విందు ఇస్తున్నారని, ఈ విషయంలో తాము మాత్రం ఏ విధంగానూ కాంగ్రెస్‌తో పోటీ పడటం లేదని, తాను ట్రిపుల్‌ తలాక్‌ బాధితుల కోసం ఇఫ్లార్‌ విందు ఇస్తున్నానని నఖ్వీ అన్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్‌ ఇఫ్తార్‌ విందు ఇస్తోందని భావిస్తోన్న బీజేపీ ఆ పార్టీకి పోటీగానే ఇఫ్తార్‌ విందు ఇస్తోందని కాంగ్రెస్‌ నేతలు కూడా విమర్శిస్తున్నారు.         

More Telugu News