chiranjeevi: చరణ్ హీరోగా 'గ్యాంగ్ లీడర్' రీమేక్ . . ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోన్న టాక్

  • చిరంజీవి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా 'గ్యాంగ్ లీడర్'
  • మ్యూజికల్ హిట్ గా నిలిచిన మూవీ 
  • రీమేక్ కి సన్నాహాలంటూ టాక్    

చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల జాబితాలో 'గ్యాంగ్ లీడర్' ఒకటిగా కనిపిస్తుంది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో .. విజయబాపినీడు దర్శకత్వంలో 1991లో ఈ సినిమా వచ్చింది. బప్పీలహరి సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది.

అలాంటి ఈ సినిమాను చరణ్ హీరోగా రీమేక్ చేసే అవకాశం ఉందనే టాక్ కొంతకాలంగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అలాంటి సమయం త్వరగా రావాలనే మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక వేదికపై చిరూ మాట్లాడుతూ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై చరణ్ సినిమా ఉంటుందని చెప్పారు. దాంతో ఆ సినిమా 'గ్యాంగ్ లీడర్' కి రీమేక్ అనే ప్రచారం ఊపందుకుంది. ఒరిజినల్ కథలో ఈ జనరేషన్ కి తగినట్టుగా మార్పులు .. చేర్పులు చేసే పనిలో వున్నట్టుగా సమాచారం. రాజమౌళి మల్టీస్టారర్ తరువాత చరణ్ చేయనున్న ప్రాజెక్టు ఇదేనని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.    

More Telugu News