murugadoss: హిందీలోకి 'స్పైడర్' రీమేక్ .. మురుగదాస్ తాజా నిర్ణయం!

  • తెలుగులో ప్లాప్ అయిన 'స్పైడర్'
  • తమిళంలో ఫరవాలేదనే టాక్ 
  • హిందీ రీమేక్ దిశగా సన్నాహాలు     

మహేశ్ బాబు హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడు మురుగదాస్ 'స్పైడర్' చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగులో పరాజయం పాలైంది. తమిళంలో మాత్రం ఫరవాలేదనిపించుకుంది. హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు .. కానీ రీమేక్ చేయాలనే ఆలోచనతోనే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు.

ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆదరణ పొందకపోవడంతో, ఇక హిందీలో ఈ సినిమా లేనట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయనున్నట్టు తాజా ఇంటర్వ్యూలో మురుగదాస్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  

More Telugu News