mohammed shami: మొహమ్మద్ షమీకి మరో షాక్.. టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టిన సెలెక్టర్లు

  • ఫిట్ నెస్ టెస్టులో ఫెయిల్ అయిన షమీ
  • ఆఫ్ఘనిస్థాన్ తో జరగనున్న టెస్టుకు దూరం
  • షమీ స్థానంలో నవదీప్ శైనీ ఎంపిక
ఆఫ్ఘనిస్థాన్ తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ నుంచి పేసర్ మొహమ్మద్ షమీని సెలక్టర్లు పక్కనపెట్టారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో షమీ విఫలమయ్యాడు. దీంతో, షమీని డ్రాప్ చేసిన సెలెక్టర్లు, అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ నవదీప్ శైనీని ఎంపిక చేశారు.

మరోవైపు  ట్రైనింగ్ సెషన్లకు హాజరు కావాలంటూ ఇండియా-ఏ జట్టు ఫాస్ట్ బౌలర్లైన మొహమ్మద్ సిరాజ్, రాజనీష్ గుర్బానీలకు టీమ్ మేనేజ్ మెంట్ పిలుపునిచ్చింది. నెట్స్ లో ఇండియన్ బ్యాట్స్ మెన్ కు బౌలింగ్ చేయాలని తెలిపింది. జూన్ 14న బెంగుళూరులో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.
mohammed shami
afghanistan
navdeep saini
bcci
cricket
test match

More Telugu News