nani: శ్రీరెడ్డికి లీగల్‌ నోటీసులు పంపిన సినీనటుడు నాని

షార్ట్స్‌లో చూడండి
తనపై పదే పదే విపరీతంగా ఆరోపణలు చేస్తోన్న యువనటి శ్రీరెడ్డికి నేచురల్‌ స్టార్‌ నాని లీగల్‌ నోటీసులు పంపినట్టు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో తనపై ఆమె నిరాధార ఆరోపణలు చేసిందని, తన పరువుకి భంగం కలిగిస్తోందని నాని పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఆ నోటీసులను  పంపారు. ఏడు రోజుల్లోగా సిటీ సివిల్‌ న్యాయస్థానంలో సమాధానం ఇవ్వాలని న్యాయవాదులు పేర్కొన్నారు. కాగా, శ్రీరెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పలువురు తెలుగు హీరోలపై విపరీతంగా ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో నాని కూడా ఉన్నారు.
Go Back to Shorts
nani
sri reddy

More Telugu News