Posani Krishna Murali: పోసానిని హైదరాబాదులో తిరగనివ్వం: గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడి వార్నింగ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. పోసానిని హైదరాబాదులో తిరగనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ ఏజెంట్ లా ఆయన మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కు హుటాహుటిన వచ్చారు. అయితే, ఈలోగానే ప్రెస్ మీట్ ను ముగించుకుని పోసాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Go Back to Shorts
Posani Krishna Murali
tTelugudesam
mn srinivas
Chandrababu

More Telugu News