Congress: మోదీ పాలనలో దళితులపై నేరాలు పెరిగాయి!: వరంగల్‌లో మల్లికార్జున ఖర్గే

  • కేంద్ర సర్కారువి నిరంకుశ చర్యలు
  • అందరూ ఖండించాలి
  • ప్రకాశ్‌రెడ్డిపేటలో ఎస్సీ, ఎస్టీల సింహగర్జనలో ఖర్గే

దేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం కాకుండా కాపాడుకునే ఉద్దేశంతో వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ఎస్సీ, ఎస్టీల సింహగర్జన నిర్వహిస్తున్నారు. ఈ సభకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు సుశీల్‌ కుమార్‌షిండే, కిశోర్‌ చంద్రదేవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా పలువురు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... మోదీ పాలనలో దేశంలో ప్రతిరోజు ఆరుగురు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర సర్కారు నిరంకుశ చర్యలను అందరూ ఖండించాలని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దళితులపై నేరాలు పెరిగాయని చెప్పారు. దేశంలో రోజూ 11 మంది దళితులు హత్యలకు గురవుతున్నారని అన్నారు.

More Telugu News