KTR: మంత్రి హరీశ్‌ రావు ద్విపాత్రాభినయం చేశారు: కేటీఆర్‌

  • ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం
  • టీఎంయూకు హరీశ్‌ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు
  • అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు మధ్యవర్తిత్వం చేశారు

కార్మిక పక్షపాతిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చలు సఫలమైన నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు సఫలమయ్యేట్లు సహకరించిన కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ముఖ్యంగా రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఎందుకంటే టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్ రావు అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు మధ్యవర్తిత్వం వహించారని, ద్విపాత్రాభినయం చేశారని నవ్వుతూ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేసీఆర్‌తో చర్చించామని, భవిష్యత్తులో తాము చేయనున్న కొన్ని సంస్కరణలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని అన్నారు. 

More Telugu News