gold: వరుసగా నాలుగో రోజు పెరిగిన బంగారం ధర

షార్ట్స్‌లో చూడండి
బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర మళ్లీ రూ.32,000 మార్కును దాటింది. ఈరోజు 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి, రూ. 32,050గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారం దుకాణదారుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండడంతో నాలుగు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

మరోవైపు వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తూ కిలో ధర రూ.100 పెరిగి, రూ.41,100గా నమోదైంది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగింది. ఇక గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర 0.17 శాతం పెరిగి ఒక ఔన్సు 1,299 అమెరికా డాలర్లుగా ఉంది.
Go Back to Shorts
gold
silver
rates

More Telugu News