Bollywood: బాలీవుడ్ నటుడు సల్మాన్ ని కలిసిన మంత్రి గడ్కరీ

  • ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ పేరిట బీజేపీ ప్రచారం
  • ముంబైలో సల్మాన్ ని, ఆయన తండ్రిని కలిసిన గడ్కరీ
  • మోదీ పాలనలో విజయాలను వివరించిన మంత్రి

‘సంపర్క్ ఫర్ సమర్థన్’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం పేరిట ఇప్పటికే పలువురు ప్రముఖులను, సెలిబ్రిటీలను బీజేపీ నేతలు కలిశారు. ఈ క్రమంలో బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలుసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ నివాసానికి ఈరోజు మంత్రి వెళ్లారు.

ఈ సందర్భంగా సల్మాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ తో గడ్కరీ సమావేశమయ్యారు. ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించి చెప్పారు. ఓ బుక్ లెట్ ను సలీమ్ ఖాన్ కు అందజేసినట్టు గడ్కరీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

More Telugu News