ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్... లగేజీ చార్జిపై ప్రతీ కిలోకు రూ.100 పెంపు
- ఇకపై అదనపు లగేజీ ప్రతీ కీలోకు రూ.500 చార్జీ
- ఈ నెల 11 నుంచి అమల్లోకి
- 5-11 శాతం జీఎస్టీ అదనం
సవరించిన చార్జీలు ఎయిర్ ఇండియా నిర్వహించే అన్ని ఫ్లయిట్లలో జూన్ 11 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఎకానమీ తరగతి ప్రయాణికులు లగేజీ చార్జీలపై అదనంగా 5 శాతం జీఎస్టీ, ఇతర తరగతుల వారు 12 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రయాణికులపై జీఎస్టీ చార్జీలు ఉండవు.