tcs: కొత్తగా 20 వేల ఉద్యోగ ఆఫర్లు అందించిన టీసీఎస్‌

  • వివరాలు తెలిపిన టీసీఎస్‌ గ్లోబల్‌ హ్యుమన్‌ రిసోర్సస్‌ చీఫ్
  • నాన్‌-ప్రెషర్లకు కూడా మరో 4,000 జాబ్‌ ఆఫర్లు  
  • 2015లో 40 వేల ఆఫర్‌ లెటర్లు
  • ఈ ఏడాది 35,000

ప్రెష్‌ గ్రాడ్యుయేట్లకు టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు ఇచ్చింది. టీసీఎస్‌ గ్లోబల్‌ హ్యుమన్‌ రిసోర్సస్‌ చీఫ్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజోయేంద్ర ముఖర్జీ తాజాగా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య ఆఫ్‌-క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించి, 20 వేల ఉద్యోగ ఆఫర్లు ఇచ్చారు. అలాగే, నాన్‌-ప్రెషర్లకు కూడా మరో 4,000 జాబ్‌ ఆఫర్లు ఇచ్చారు.

ఐటీ రంగంలో ఓ వైపు నియామకాలు తగ్గిపోతోంటే మరోవైపు టీసీఎస్‌లో మాత్రం నియామకాలు ఆగడం లేదు. 2015లో కంపెనీ 40 వేల ఆఫర్‌ లెటర్లను అందించగా, ఈ ఏడాది మొత్తం 35 వేలు అందించింది. ఈ ఆఫర్లు అందుకున్న వారిలో 70 శాతం మంది తమ సంస్థలో చేరతారని టీసీఎస్‌ భావిస్తోంది. గత కొన్నేళ్లుగా టీసీఎస్‌ రీస్కిల్లింగ్ ప్రొగ్రామ్స్‌ కూడా చేపడుతోంది.                                

More Telugu News