Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ ఇలా చేస్తారనుకోలేదు: అహ్మద్ పటేల్
- ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవుతారని తాము భావించలేదన్న అహ్మద్ పటేల్
- నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరిన వీహెచ్
- గాంధీ కూడా ఆరెస్సెస్ కార్యక్రమానికి వచ్చారన్న అమిత్ షా
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరగనున్న ఆరెస్సెస్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హజరుకానుండడంపై యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరవుతారని తాము ఊహించలేదని ఆయన ట్వీట్ చేశారు.
ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకాకపోవడమే మేలని ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ చెప్పిన గంటల వ్యవధిలోనే అహ్మద్ పటేల్ స్పందించారు. ఆరెస్సెస్ తో ప్రణబ్ కలవడం కొత్త సమస్యలకు శ్రీకారం చుడుతుందని అనేక మంది భావిస్తున్నారు. సంఘ్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకాకూడదని తెలంగాణ నేత వి.హనుమంతరావు కూడా కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రణబ్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వీహెచ్ అన్నారు.
మరోవైపు, ప్రణబ్ నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వాగతించారు. మహాత్మాగాంధీ, మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ లాంటి వారు కూడా ఆరెస్సెస్ కార్యక్రమాలకు అతిథులుగా వచ్చారని గుర్తు చేశారు.