chandrasiddharth: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'ఆటగదరా శివ' ట్రైలర్

  • చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో 'ఆటగదరా శివ'
  • కథ ప్రధానంగా సాగే సినిమా 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
దర్శకుడు చంద్రసిద్ధార్థ పేరు వినగానే 'ఆ నలుగురు' .. 'మధుమాసం ' .. 'అందరి బంధువయా' వంటి విభిన్నమైన కథా చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆయన ఎంపిక చేసుకునే ప్రతి కథలోనూ మానవీయకోణం కనిపిస్తుంది .. సమాజంలోని స్థితిగతులను దర్శింపజేస్తుంది. అలాంటి చంద్రసిద్ధార్థ తన తాజా చిత్రంగా 'ఆటగదరా శివ' రూపొందించాడు.

 ఒక ఖైదీని ఉరి తీయడానికి రావలసిందిగా ప్రభుత్వం నుంచి లేఖ అందుకున్న హ్యాంగ్ మేన్ తన జీపులో బయలుదేరుతాడు. అదే ఖైదీ జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వస్తూ ఆ హ్యాంగ్ మేన్ కి తారసపడతాడు .. అదే ఈ ట్రైలర్ లో చూపించారు. 'జబర్దస్త్'తో క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది కామెడీ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   
chandrasiddharth

More Telugu News