Chandrababu: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో పొత్తులే కీలక పాత్ర పోషిస్తాయి!: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
గడిచిన నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం మంచిని చెడుగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని, వారి ఆటలు సాగబోవన్నారు. ప్రజలకు ఏది మంచో, ఏది చెడో తెలుసని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి ఈ రోజు నవనిర్మాణ దీక్షపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు అందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూశామని, దాంతో అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నెలకొందని చెప్పారు. 2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పొత్తులకు అవకాశం లేదన్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులే కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, ఎల్ఈడీ వీధి దీపాలు, కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
Go Back to Shorts
Chandrababu

More Telugu News