auto: ఆటోపై కారును తీసుకెళ్లిన వైనం... వీడియో వైరల్

  • చెన్నైలో ఘటన
  • ఆటో డ్రైవర్‌కి ఫైన్‌
  • నెటిజన్ల సెటైర్లు

మూడు చక్రాల వాహనంపై నాలుగు చక్రాల వాహనాన్ని మోసుకుపోయిన ఘటనకు సంబంధించిన వీడియోను ఓ చైనా మీడియా తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ఆ దేశంలోని జెజియాంగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కారు పాడవడంతో దాని పార్టులను అమ్మేయాలని భావించాడు.

దీంతో దానిని ఓ చోటి నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఓ ఆటోను మాట్లాడుకుని దానిపై ఉంచి తీసుకెళ్లాడు. అయితే, ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్‌కు 1300 యువాన్ల (దాదాపు 13,500) ఫైన్‌ వేశారు. ఆటోపై కారును తీసుకెళ్లిన వైనంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.                       

More Telugu News