IDEA CELLULAR: వొడాఫోన్ నుంచి 6.6 లక్షల మంది జంప్... ఐడియా, ఎయిర్ టెల్ కు కొత్తగా కోటి మంది

షార్ట్స్‌లో చూడండి
టెలికం చందాదారుల పరంగా కంపెనీల స్థానాలు మారిపోతున్నాయి. జియో ప్రవేశంతో ఈ రంగం రూపు రేఖలే మారిపోయిన విషయం తెలిసిందే. పెద్ద కంపెనీలు అస్తిత్వ ముప్పు కోసం జియోతో పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించి టెలికం యూజర్ల గణాంకాలను పరిశీలిస్తే ఐడియా, ఎయిర్ టెల్ ఈ రెండు సంస్థలకు మొత్తంగా కోటి మంది చందాదారులు తోడయ్యారు. అదే సమయంలో వొడాఫోన్ నుంచి 6.6 లక్షల మంది చందాదారులు బయటకు వెళ్లిపోయారు.

ఐడియా సెల్యులర్ కు 55.5 లక్షల మంది కొత్త కస్టమర్లు ఏప్రిల్ మాసంలో వచ్చి చేరారు. దీంతో ఐడియా మొత్తం చందాదారుల సంఖ్య 21.6 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్ టెల్ ఇప్పటికీ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థకు 30.86 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఏప్రిల్ నెలలో కొత్తగా 45 లక్షల మంది వచ్చి చేరారు. వొడాఫోన్ చందాదారుల సంఖ్య 22.2 కోట్లు. ఈ ఏడాది మార్చి నాటికి టెలికం రంగంలో 104.9 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
Go Back to Shorts
IDEA CELLULAR
vodafone
jio
airtel

More Telugu News