బీచ్ లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: గోవా బీజేపీ మహిళా చీఫ్
- అనుచిత ఘటనలు జరగకుండా నివారణోపాయం సూచించిన సులక్షణ సావంత్
- ప్రతీ ఒక్కరికీ రక్షణను ప్రభుత్వం కల్పించలేదు
- ప్రజలే తోటి వారికి రక్షణ ఇవ్వగలరని అభిప్రాయాలు
‘‘ప్రజల మనస్తత్వాన్ని మార్చాలి. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించలేం. కానీ, ప్రజలే ఇతరుల పాలిట రక్షణ కవచంగా వ్యవహరించగలరు’’ అని ఓ ఉచిత సలహా పడేశారు. ఎక్కువ మంది ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నందునే ఎక్కువ అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయని సులక్షణ సావంత్ పేర్కొన్నారు. మారుమూల బీచ్ లలో అనుచిత ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోవాకు ఏటా 70 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇందులో 5 లక్షల మంది వరకు విదేశీయులే.