Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'దటీజ్ మహాలక్ష్మి'గా తమన్నా 
  • యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు 'సైరా'! 
  • 'బిగ్ బాస్ 2'షోలో లేనంటున్న తరుణ్ 
  • ఆడియో వేడుకకి 'తేజ్.. ఐ లవ్ యూ'  

*  హిందీలో హిట్టయిన 'క్వీన్' చిత్రాన్ని తమన్నా నాయికగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'దటీజ్ మహాలక్ష్మి' అనే టైటిల్ని ఖరారు చేసినట్టు తాజా సమాచారం. దీనికి 'అ' ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం తాజా షెడ్యూలు ఈ నెల 7 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో నయనతార నాయికగా నటిస్తోంది.
*  మాటీవీలో ప్రసారం కానున్న 'బిగ్ బాస్ 2' రియాలిటీ షోలో తాను పాల్గొంటున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ హీరో తరుణ్ ఖండించాడు. ఈ వార్తలో వాస్తవం లేదని, అసలు ఇలాంటి షోలో పాల్గొనే ఆసక్తి కూడా తనకు లేదని తరుణ్ స్పష్టం చేశాడు.
*  సాయి ధరం తేజ్ నటిస్తున్న 'తేజ్.. ఐ లవ్ యూ' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 9 సాయంకాలం హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తారు. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.

More Telugu News