ఆసక్తిని రేపుతోన్న 'సమ్మోహనం' ట్రైలర్

31-05-2018 Thu 10:06
  • సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం'
  • కథానాయికగా అదితీరావు 
  • జూన్ 15వ తేదీన విడుదల  
సుధీర్ బాబు .. అదితీరావు జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం' సినిమా రూపొందింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది. తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ రోజున సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ట్రైలర్ ను వదిలారు.

ఈ కథ సినిమా ప్రపంచానికి సంబంధించిన నేపథ్యంలో కొనసాగుతుందనే విషయాన్ని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కథలో నాయిక సినిమా హీరోయిన్ గా కనిపిస్తుంది. ఆమె ప్రేమలో పడిన యువకుడిగా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. "ఈ సినిమా వాళ్ల మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పనుకున్నాను .. నిన్ను కలిసిన తరువాత. కాదని చెంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావ్" అంటూ సుధీర్ బాబు ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ బాగా పేలింది. జూన్ 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.