తూచ్... 60 పైసలు కాదు... పెట్రోలు ధర తగ్గింది ఒక్క పైసాయే!

  • 19 రోజుల పాటు పెరిగిన 'పెట్రో' ధరలు
  • 60 పైసలు తగ్గిస్తున్నట్టు ఈ ఉదయం ప్రకటన
  • పొరపాటు జరిగిందన్న ఐఓసీ
వరుసగా 19 రోజుల పాటు పరుగాపకుండా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజెల్ ధరలు, నేడు 60 పైసలు తగ్గాయని వాహనదారులు పడ్డ ఆనందం మూడు గంటల ముచ్చటే అయింది. పెట్రోలు, డీజిల్ ధరల సవరణలో పొరపాటు జరిగిందని, తగ్గింది 60 పైసలు కాదని, ఒక్క పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ ఉదయం పెట్రోలు ధరను 60 పైసలు, డీజెల్ ధరను 59 పైసలు తగ్గిస్తున్నట్టు ఐఓసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తప్పును సరిదిద్దుకుంటున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
Go Back to Shorts
Petrol
Diesel
IOC

More Telugu News