కొనసాగుతున్న జగన్ పాదయాత్ర.. నైట్ క్యాంపు వద్ద ప్రజల నుంచి సలహాల స్వీకరణ!
- వడదెబ్బను లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్న జగన్
- 176వ రోజుకు చేరుకున్న ప్రజాసంకల్ప యాత్ర
- కొప్పర్రు నుంచి స్టీమర్ రోడ్డు వరకు కొనసాగనున్న నేటి యాత్ర
కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగనుంది. భోజన విరామం అనంతరం చిన మామిడిపల్లి, నరసాపురం, స్టీమర్ రోడ్డు వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. జగన్ కు సలహాలు, సూచనలు ఇవ్వాలనుకునే వారు నైట్ క్యాంపుకు వెళ్లి, ఆయనను కలుసుకుని తమ లేఖలను అందజేయవచ్చు.