కృష్ణ పుట్టిన రోజున 'సమ్మోహనం' ట్రైలర్ రిలీజ్

29-05-2018 Tue 11:42
  • ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం'
  • సుధీర్ బాబు జోడీగా అదితీరావు 
  • జూన్ 15వ తేదీన సినిమా రిలీజ్  
సుధీర్ బాబు .. అదితీరావు జంటగా 'సమ్మోహనం' చిత్రం రూపొందింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమైంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను జూన్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ట్రైలర్ తో మరింతగా అంచనాలను పెంచడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున ఉదయం 9 గంటల 18 నిమిషాలకి ఆయన చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను కూడా వదిలారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఇంద్రగంటి .. సుధీర్ బాబు వున్నారు.