ఎన్టీఆర్ జయంతి: నందమూరి వంశీయులతో కళకళలాడుతున్న ఎన్టీఆర్ ఘాట్!

28-05-2018 Mon 08:14
  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • సందడిగా మారిన హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్
  • నివాళులర్పిస్తున్న నేతలు, సినీ ప్రముఖులు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. నందమూరి హీరోలు పలువురు ఎన్టీఆర్ స్మృతి చిహ్నాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు.

నందమూరి హరికృష్ణతో పాటు ఆయన కుమారులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే బాధ్యతలను తలకెత్తుకున్న క్రిష్ కూడా ఘాట్ కు వచ్చాడు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.