US police: రికార్డు బ్రేకింగ్ సీజ్! 2.6 కోట్ల మందిని చంపగలిగేంత డ్రగ్స్ స్వాధీనం
అమెరికా పోలీసులు రికార్డు సృష్టించారు. ఏకంగా 2.6 కోట్ల మందిని చంపగలిగేంత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నెబ్రాస్కాలోని ఓ కంపార్ట్‌మెంట్‌లో ట్రక్కులో దాచిపెట్టిన 53.5 కేజీల ఫెంటానిల్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌తో రెండున్నర కోట్ల మందిని చంపేయవచ్చని యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఈ మొత్తం డ్రగ్స్ విలువ రూ.135 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. హెరాయిన్ కంటే ఫెంటానిల్ 30 నుంచి 50 రెట్ల శక్తిమంతమైనది వివరించారు.