సిద్ధిపేటలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని దూసుకెళ్లిన లారీ.. 10 మంది మృతి
- రెండు లారీలు, బస్సు, క్వాలీస్ పరస్పరం ఢీ
- 26 మందికి గాయాలు
- ఆసుపత్రులకు తరలింపు
అదే సమయంలో ఆ రోడ్డుపై వెళుతోన్న క్వాలీస్‌తో పాటు ఓ కంటైనర్‌ను సదరు లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్వాలీస్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.