boat: ఏపీలో విషాదాన్ని నింపిన మరో పడవ ప్రమాదం

  • కృష్ణా నదిలో ప్రమాదం
  • చేపల వేటకు వెళ్లిన పడవను ఇసుక పడవ ఢీకొట్టిన వైనం
  • తల్లీ, కూతురు గల్లంతు
ఏపీలో ఈ ఉదయం మరో పడవ ప్రమాదం విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లాలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక రీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని తల్లీకూతుర్లుగా గుర్తించారు.

 కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఓ కుటుంబం చేపల వేట కోసం కృష్ణానదిలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇసుకను తరలిస్తున్న ఓ బోటు వీరి పడవను ఢీకింది. ఈ ప్రమాంలో తల్లీకూతురు నీటిలో మునిగిపోయారు. భర్త ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. మృతి చెందిన ఇద్దరినీ ఒడ్డుకు తీసుకువచ్చారు. వీరి మృత దేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు, ప్రమాదం ఎలా జరిగింది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. 
boat
accident
krishna river

More Telugu News