Mahesh Babu: ర‌షీద్ ఖాన్‌.. నీకు నా సెల్యూట్: మహేశ్ బాబు

  • కీలక మ్యాచ్ లో అదరగొట్టిన స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు రషీద్ ఖాన్‌
  • ఆకాశానికి ఎత్తేసిన టాలీవుడ్ సెల‌బ్రిటీలు
  • ధ‌న్యవాదాలు తెలిపిన ర‌షీద్ ఖాన్
నిన్న జ‌రిగిన కీలక క్వాలిఫ‌య‌ర్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తో కూడా అదరగొట్టిన స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు రషీద్ ఖాన్‌ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తాజాగా టాలీవుడ్ సెల‌బ్రిటీలు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ లు ర‌షీద్ ఖాన్ కి సెల్యూట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

దీనికి స‌మాధానంగా ర‌షీద్.. వారి సినిమాలు చాలా బాగుంటాయని తెలుపుతూ ధ‌న్యవాదాలు కూడా తెలిపాడు. కాగా ర‌షీద్ ఖాన్ నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్‌లో కేవలం 10 బంతుల్లో 34 రన్స్ చేయడంతో పాటు బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ చేరిన స‌న్‌రైజ‌ర్స్ జట్టు కప్పు కోసం రేపు చెన్నైని ఢీకొనబోతోంది.
Mahesh Babu
Tollywood
Cricket
ipl2018
Hyderabad
rashidh khan

More Telugu News