amani: అనుపమ పరమేశ్వరన్ తల్లి పాత్రలో ఆమని

  • రామ్ హీరోగా 'హలో గురు ప్రేమ కోసమే'
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • ఆమని భర్త పాత్రలో ప్రకాశ్ రాజ్ 
నటన పరంగా తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న సీనియర్ కథానాయికలలో ఆమని కూడా కనిపిస్తారు. మిస్టర్ పెళ్లామ్ .. శుభలగ్నం .. శుభ సంకల్పం .. మావి చిగురు వంటి సినిమాలు ఆమని అసమాన నటనకు అద్దం పడతాయి. అలాంటి ఆమని ఇటీవల 'భరత్ అనే నేను' సినిమాలో మహేశ్ బాబుకి తల్లి పాత్రలో నటించారు. కథానాయకుడి పాత్రను లక్ష్యం దిశగా నడిపించే ఈ పాత్రలో ఆమని మరింతగా మెప్పించారు.దాంతో ఇప్పుడు ఆమనికి వరుస అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అనుపమ పరమేశ్వరన్ కి తల్లిగా నటించడానికి ఆమె ఓకే చెప్పేసినట్టుగా సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకి 'హలో గురు ప్రేమకోసమే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వన్ తల్లి పాత్రకి ప్రాముఖ్యత ఉండటంతో ఆమనిని తీసుకున్నారట. ఆమె భర్త పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు.      
amani
ram
anupama

More Telugu News