టీటీడీలో మరో లొల్లి... ప్రధానార్చక పదవి కోసం పోటాపోటీ!
- తమనే నియమించాలని డిమాండ్
- ఈఓను కోరిన గొల్లపల్లి, తిరుపతమ్మ వంశీయులు
- తమకు అనాదిగా అన్యాయం జరుగుతున్నదని లేఖ
- ఇంకా స్పందించని టీటీడీ
కాగా, అర్చకుల లేఖపై టీటీడీ అధికారులు ఇంకా పెదవి విప్పలేదు. మరోవైపు టీటీడీ ఉద్యోగులు నేడు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. అయితే, భక్తుల నుంచి వచ్చిన విమర్శలతో ఈ నిరసనలు తిరుపతికి మాత్రమే పరిమితం అయ్యాయి. తిరుపతిలోని వివిధ టీటీడీ అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు మాత్రమే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.