amezon: అమెజాన్‌ చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తోన్న కస్టమర్లకు నో సర్వీస్‌

  • కారణం లేకుండా వస్తువులను వెనక్కి ఇచ్చేస్తోన్న కస్టమర్లు
  • సమాధానం చెప్పాలని అడుగుతోన్న అమెజాన్‌
  • ఆ తరువాత బ్యాన్

నిబంధనలను ఉల్లంఘిస్తోన్న తమ కస్టమర్లను ప్రముఖ ఈ -కామర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్‌ బ్యాన్‌ చేస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసి, అవి నచ్చకపోతే తిరిగి ఇచ్చేయొచ్చన్న విషయం తెలిసిందే. అయితే, ఈ వెసులుబాటును ఆసరాగా తీసుకుని ఒక్కోసారి ఎలాంటి కారణం లేకుండా వాటిని పదేపదే వెనక్కి ఇచ్చేస్తోన్న వారిపై అమెజాన్‌ చర్యలు తీసుకుంటోంది.

చాలా కాలం నుంచి అమెజాన్‌.. ఇటువంటి కస్టమర్ల అకౌంట్లను రద్దు చేస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఈజీ ఫ్రీ రిటర్న్‌ పాలసీ వల్ల పలు సమస్యలు ఏర్పడుతోన్న నేపథ్యంలో అమెజాన్‌ కస్టమర్లను బ్యాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 12 నెలల్లో పలు వస్తువులను కొనుగోలు చేసి మళ్లీ ఆ ఆర్డర్లను వెనక్కి తిరిగి ఇచ్చేసిన వారికి అమెజాన్‌ మొదట మెసేజ్‌ పంపుతోంది. అందుకు గల కారణాన్ని చెప్పాలని కూడా అడుగుతోంది. ఆ తరువాత వారి అకౌంట్‌ను రద్దు చేస్తోంది. 

More Telugu News