chidambaram: పెట్రోల్ ధరలను రూ. 25 వరకు తగ్గించవచ్చు: చిదంబరం

  • ధరలను తగ్గించే అవకాశం ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదు
  • ఖజానాను నింపుకునేందుకు సామాన్యులపై భారం మోపుతోంది
  • కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ చిదంబరం

ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలను రూ. 25 వరకు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 1 లేదా 2 తగ్గించి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఖజానాను నింపుకునేందుకు సామాన్యులపై భారం మోపుతోందని అన్నారు.

ముడిచమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలను లీటరుకు రూ. 15 వరకు తగ్గించవచ్చని... ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను రూపంలో వసూలు చేస్తున్న మొత్తాన్ని తగ్గించడం ద్వారా మరో రూ. 10 తగ్గించవచ్చని చెప్పారు. మొత్తంమీద రూ. 25 వరకు తగ్గించవచ్చని తెలిపారు. పెట్రో ధరలను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ... కేంద్రం మాత్రం ఆదాయం గురించే ఆలోచిస్తోందని విమర్శించారు.

More Telugu News