devegowda: దేవేగౌడ విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించిన ఉద్దవ్ థాకరే

  • ఉద్దవ్ థాకరేకు ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన దేవేగౌడ
  • పల్ఘర్ ఉపఎన్నికలకు సంబంధించి బిజీగా ఉన్నానని చెప్పిన ఉద్దవ్
  • బెంగళూరుకు వెళుతున్న కమలహాసన్

తన కుమారుడు కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేకు మాజీ ప్రధాని దేవేగౌడ ఫోన్ చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. అయితే, దేవేగౌడ విన్నపాన్ని ఉద్దవ్ థకరే సున్నితంగా తిరస్కరించారు. పల్ఘర్ ఉపఎన్నికల నేపథ్యంలో, తాను చాలా బిజీగా ఉన్నానని... ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేనని, తనను మన్నించాలని కోరారు. ఇదే సమయంలో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాయంత్రం 4.30 గంటలకు కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

మరోవైపు, తూత్తుకూడిలో పోలీసుల కాల్పుల్లో 11 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, కుమారస్వామి ప్రమాణస్వీకారానికి సినీ నటుడు కమలహాసన్ హాజరుకావడం లేదనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదని తేలింది. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన బెంగళూరుకు పయనమవుతారని సమాచారం. 

More Telugu News