కాంగ్రెస్‌కి 22, జేడీఎస్‌కి 12.. కర్ణాటక మంత్రివర్గ కూర్పునకు కుదిరిన ఒప్పందం.. 24న బలపరీక్ష
- సీఎంగా రేపు జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం
- డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర
- కాంగ్రెస్‌కు స్పీకర్, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్ పదవులు
ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు స్పీకర్, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్ పదవులు దక్కాయి. స్పీకర్‌గా కాంగ్రెస్ నేత కేఆర్ రమేశ్ కుమార్‌ను ఈ నెల 25న ఎన్నుకోనున్నారు. బల నిరూపణ తరువాతే మంత్రి పదవుల అంశంలో శాఖల కేటాయింపుల ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాగా, కుమారస్వామి ఈ నెల 24న బలపరీక్ష ఎదుర్కోనున్నారు.